సేవ్ సీఎస్‌కే
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కూ ఓ అభిమాని హాజరవుతాడు. శరీరం మొత్తం పసుపు రంగు పూసుకుని ధోని అని రాసుకుని వస్తాడు. అతని పేరు శరవణన్. ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే... చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కాపాడాలంటూ తనో ఉద్యమం ప్రారంభించాడు. ఇటీవల లోధా కమిటీ ఇచ్చిన తీర్పు మేరకు సీఎస్‌కే జట్టును రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి నిషేదించారు. దీనికి వ్యతిరేకంగా శరవణన్ ఉద్యమం ప్రారంభించాడు. ‘జట్టుగానీ, అందులో క్రికెటర్లుగానీ ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. అలాంటప్పుడు జట్టునెందుకు నిషేధించాలి’ అని ప్రశ్నిస్తూ... సేవ్ సీఎస్‌కే అంటూ సంతకాల సేకరణ ప్రారంభించాడు. చిదంబరం స్టేడియం బయట శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మరికొందరు అభిమానులతో కలిసి నినాదాలు చేశాడు. ఇలా ఉద్యమం ద్వారా సంతకాలు సేకరించి వాటిని బీసీసీఐకి పంపడంతో పాటు వాటితో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేస్తాడట. ఏమైనా అభిమానం అంటే ఇదే మరి.