రాంచీ: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్ ల్లో చెన్నై గెలిచిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన పోరుకు వచ్చేసరికి చెన్నై జట్టులో బ్రెండన్ మెకల్లమ్ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో చైన్నై ఒక్కసారిగా బలహీనపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరు అన్ని విభాగాల్లోనూ చెన్నై కంటే మెరుగ్గా ఉంది.