
పుజారాపై ఎలాంటి ఒత్తిడీ లేదు: కుంబ్లే
వేగంగా ఆడలేడంటూ చతేశ్వర్ పుజారాపై వస్తున్న విమర్శలను భారత కోచ్ అనిల్ కుంబ్లే కొట్టిపారేశారు. టెస్టుల్లో బౌలర్లకే తప్ప బ్యాట్స్‌మెన్‌కు స్ట్రైక్ రేట్ ముఖ్యం కాదని ఆయన అన్నారు. పరిస్థితిని బట్టి బాగా ఆడటం ముఖ్యమని, అప్పుడే ఆటగాడి విలువ తెలుస్తుందన్న కోచ్ ఆ రకంగా చూస్తే పుజారా తమ జట్టులో కీలక ఆటగాడని మద్దతు పలికారు. టి20ల వల్ల బ్యాటింగ్‌లో వేగం పెరిగిన మాట వాస్తవమే అయినా... ఒక జట్టులో వేర్వేరు తరహా శైలి గల ఆటగాళ్ల అవసరం కూడా ఉంటుందని కుంబ్లే చెప్పారు.