అండర్సన్ రికార్డుతో ఒక్కటైన ప్రేమ జంట
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రికార్డుతో ఓ ప్రేమ జంట ఒక్కటైంది.
లండన్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రికార్డుతో ఓ ప్రేమ జంట ఒక్కటైంది. ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టెస్టులో అండర్సన్ 500 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ఓ అభిమాని ఇదే సరైన సమయమని భావించి తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఆశ్చర్యానికి గురైనా ఆ అమ్మాయి అతని ప్రేమను ఒప్పుకుంది.
ఏం జరిగిందంటే..
లార్డ్స్‌వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను బౌల్డ్ చేసి అండర్సన్ 500 వికెట్ల మైలు రాయి అందుకున్నాడు. దీంతో మైదానమంతా జిమ్మీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చప్పట్లతో అభినందించారు. ఇంతలో ఓ వ్యక్తి మోకాళ్లపై నిల్చుని పక్కనే ఉన్న తన స్నేహితురాలికి తన ప్రేమను తెలియజేశాడు. ఊహించని ఘటనతో ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురైంది. ఆ వెంటనే తేరుకొని ప్రేమను అంగీకరించింది. దీంతో ఎగిరి గంతేసిన అతడు ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. దీనికి సంబంధించిన వీడియోను లార్డ్స్ మైదాన సిబ్బంది ‘ఎంగేజ్‌మెంట్ ఎట్ లార్డ్స్’ పేరిట ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మీరు చూడండి ఓసారి..