అలరించిన ‘సన్‌రైజర్స్’ ఆటగాళ్లు
మాదాపూర్, న్యూస్‌లైన్: క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన ఆటగాళ్లను ఔట్ చేశారు. ఇక్కడి ఇనార్బిట్ మాల్‌లో కింగ్‌ఫిషర్ బెవరేజెస్ ఆధ్వర్యంలో జరిగిన ‘బౌల్ ఔట్’ కార్యక్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సందడి చేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రైజర్స్ సభ్యులు హెన్రిక్స్, నమన్ ఓజా, కరణ్ శర్మ పాల్గొన్నారు. అభిమానులు ఒక్కొక్కరికి మూడు బంతుల చొప్పున బౌలింగ్ చేసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ఇందుకోసం ఆన్‌గ్రౌండ్, డిజిటల్ పోటీ ద్వారా పది మందిని, ఇనార్బిట్ మాల్‌లో మరో ఐదుగురిని ఎంపిక చేశారు. వీరంతా ఐపీఎల్ క్రికెటర్లను క్లీన్‌బౌల్డ్ చేసే పనిలో పడ్డారు.
మొదటి బంతికి ఔట్ చేస్తే రూ.50 వేలు, రెండు, మూడు బంతులకు బౌల్డ్ చేస్తే రూ. 10 వేల నగదు బహుమతి అందజేశారు. ఇందులో నగరానికి చెందిన భాస్కర్, జెస్సికాలు తొలి బంతిలోనే నమాన్ ఓజాను బౌల్డ్ చేయడంతో చెరో రూ. 50 వేల నగదు లభించింది. మరో క్రికెటర్ హెన్రిక్స్‌ను సతీష్ రెండో బంతికి ఔట్ చేయడంతో రూ. 10 వేలు అందుకున్నాడు. ఐపీఎల్ ఆటగాళ్లను అవుట్ చేసి నగదు గెలుచుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
అభిమానుల చేతిలో ‘క్లీన్ బౌల్డ్’
Published Fri, May 16 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement