
మాడ్రిడ్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన హ్యాట్రిక్‌ల రికార్డు సాధించాడు. ఆదివారం సాధించిన హ్యాట్రిక్ గోల్స్‌తో అతని హ్యాట్రిక్‌ల ఫిఫ్టీ పూర్తయింది. లా లీగా (స్పెయిన్) చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో రియల్ మాడ్రిడ్ 6–3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు.
రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌లో 41 సార్లు మూడేసి గోల్స్, ఏడు సార్లు నాలుగు గోల్స్, రెండు సార్లు ఐదు గోల్స్ ఉన్నాయి. కేవలం లా లీగాలోనే ఏకంగా 34 సార్లు హ్యాట్రిక్ సాధించిన అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సార్లు పోర్చుగల్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు చేసిన రికార్డు బ్రెజిల్ దిగ్గజం పీలే (92 హ్యాట్రిక్స్) పేరిట ఉంది.
Comments
Please login to add a commentAdd a comment