'స్పిన్ విభాగం బలహీనంగా ఉంది' | CSK spin department has been less effective, says Fleming | Sakshi
Sakshi News home page

'స్పిన్ విభాగం బలహీనంగా ఉంది'

Published Fri, Apr 24 2015 7:53 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

'స్పిన్ విభాగం బలహీనంగా ఉంది'

'స్పిన్ విభాగం బలహీనంగా ఉంది'

చెన్నై: తమ స్పిన్ విభాగం కాస్త బలహీనంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ అభిప్రాయపడ్డాడు. గత ఐపీఎల్ సీజన్ తో పోల్చుకుంటే తమ స్పిన్ వ్యవస్థ బలహీనంగా ఉందని పేర్కొన్నాడు. అయితే తమ స్పిన్నర్లపై టీమ్ మేనేజ్ మెంట్ నమ్మకం కోల్పోలేదన్నాడు. ఈ విభాగంలో తాము సత్తా చూపాల్సిన అవసరముందని వెల్లడించాడు.

స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలపై కెప్టెన్ ధోని విశ్వాసం కోల్పోలేదని స్పష్టం చేశాడు. అశ్విన్ తమ ప్రధాన బౌలర్ అని చెప్పాడు. గత మూడు మ్యాచ్ ల్లో అశ్విన్ కేవలం 4 ఓవర్లు మాత్రమే వేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement