ధోని, కోహ్లి
పుణే : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ వైపే మొగ్గుచూపాడు. ఇక ఇరు జట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. అస్వస్థతతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆర్సీబీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. మనన్ వోహ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. వాషింగ్టన్ సుంధర్ స్థానంలో మురుగన్ అశ్విన్ రాగా.. డివిలియర్స్ రాకతో డికాక్ దూరమయ్యాడు.
డేవిడ్ విల్లీ అరంగేట్రం..
కోలకతా నైట్‌రైడర్స్‌తో ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులు చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన కేదార్ జాదవ్ స్థానంలో డేవిడ్ విల్లీని తీసుకున్న విషయం తెలిసిందే. ఫాఫ్ డూప్లెసిస్, కరణ్ శర్మ, ఆసిఫ్‌లు దూరం కాగా ధృవ్ షోరే, శార్ధుల్ జట్టులోకి వచ్చారు. ఫీల్డింగ్ తప్పిదాలతో గత మ్యాచ్‌ను చేజార్చుకున్న చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవాలని ఆశిస్తోంది. ఈ సీజన్‌లో 8 ఆడి మూడు మాత్రమే గెలిచిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది.
తుది జట్లు
ఆర్సీబీ : విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థీవ్ పటేల్, బ్రెండన్ మెకల్లమ్, ఏబీ డివిలీయర్స్, మన్‌దీప్ సింగ్, గ్రాండ్ హోమ్, టిమ్ సౌథీ, మురుగన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, యుజువేంద్ర చహల్
చెన్నై సూపర్‌కింగ్స్ : ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ధృవ్ షోరే, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, డేవిడ్ విల్లీ, హర్భజన్ సింగ్, లుంగి ఎన్‌గిడి, శార్దూల్ ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment