బ్యాటింగ్ స్టైలే వేరు.. మిగతాదంతా సేమ్ టూ సేమ్.
బ్యాటింగ్ స్టైలే వేరు.. మిగతాదంతా సేమ్ టూ సేమ్.
Published Fri, Apr 7 2017 8:04 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లిని సహాచర ఆటగాడు సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పొగడ్తలతో ముంచెత్తాడు. క్రికెట్‌పై పిచ్చి తగ్గకుండా కోహ్లి సహాయం చేశాడాని అభిప్రాయ పడ్డాడు. ఒత్తిడిని ఎలా అధగిమించాలో ఐపీఎల్ సహచరుడు కోహ్లి నుంచి నేర్చుకున్నానని డివిలియర్స్ తెలిపాడు. డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లగా కోహ్లితో ఉన్నాను. నేను కోహ్లి ఒకేలా ఉంటాము. ఆట పట్ల అంకితభావం, ఆటలోని నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు, కష్టపడేతత్వం, ఓటమిని సహించకపోవడం అన్నిలక్షణాలు ఒకటే అని డివిలియర్స్ పేర్కొన్నాడు. కోహ్లికి క్రికెట్‌పై పిచ్చి మరింత ఎక్కువని అలా అతన్ని చూడటం ఇష్టమని డివిలియర్స్ అన్నాడు.
ఈ వయసులో ఆటపై మక్కువ తగ్గకుండా ఉన్నానంటే అది కోహ్లీ వల్లనే అని డివిలియర్స్ తెలిపాడు. ఒత్తిడిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కోహ్లి నుంచే నేర్చుకున్నానన్నాడు. నేను గొప్ప బ్యాట్స్‌మన్ అనుకోవడం లేదని, అన్ని ఫార్మాట్లు ఆడలేదన్నాడు. కానీ కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అని, అతను అన్ని ఫార్మట్లు ఆడాడని డివిలియర్స్ తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో టాప్-5 ర్యాంకు పొందినపుడు ఆట అంటే ఎమిటో తెలుస్తుందని చెప్పాడు. డివిలియర్స్ టెస్టుల్లో 10,000 పరుగులకు చేరువలో 8074 పరుగులతో ఉన్నాడు. ఇది గొప్ప విషయం కాదని, ఇతరులు పట్ల గౌరవం లేనప్పుడు ఎన్ని పరుగులు చేసిన వృధా అని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. గాయంతో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు దూరమైన డివిలియర్స్, 33 ఏళ్ల వయసులో కోలుకోవడం పెద్ద సమస్య కాదని వ్యాఖ్యానించాడు. ప్రాకి్టస్ చేస్తాను కాని సిల్లీ షాట్‌లు సాధన చేయనని ఏబీ తెలిపాడు.
Advertisement
Advertisement