విదర్భ, ఢిల్లీ మ్యాచ్ 28 నిమిషాలు నిలిపివేత
న్యూఢిల్లీ: నాసిరకం పిచ్ కారణంగా విదర్భ, ఢిల్లీల మధ్య శనివారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను 28 నిమిషాల పాటు తాత్కాలికంగా నిలిపేశారు. మ్యాచ్ కోసం ఉపయోగించిన రోషనార క్లబ్ వికెట్‌పై పేసర్ల బంతులు అనూహ్యంగా బౌన్స్ అవుతూ ప్రమాదకరంగా బ్యాట్స్‌మెన్‌ను తాకాయి.
ఢిల్లీ పేసర్ నెహ్రా బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తే.. మరో పేసర్ పర్వీందర్ అవానా వేసిన ఓ బంతి అమోల్ జుంగాడే భుజాన్ని బలంగా తాకింది. దీంతో పెయిన్ కిల్లర్‌తో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై విదర్భ కెప్టెన్ శలభ్ శ్రీవాస్తవ అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ రిఫరీ సంజయ్ పాటిల్ మైదానంలోకి వచ్చాడు. అంపైర్లతో పాటు ఇద్దరు కెప్టెన్లతో చర్చించి కొద్దిసేపు మ్యాచ్‌ను నిలిపేశారు. తర్వాత వికెట్‌పై బరువైన రోలర్లతో రోలింగ్ చేయించి మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే ఢిల్లీ కోచ్ సంజీవ్ శర్మ మాత్రం పిచ్‌కు మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌లో ఇలాంటివి సర్వసాధారణమని, కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయని వ్యాఖ్యానించారు.
రంజీలో నాసిరకం పిచ్
Published Sun, Dec 15 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement