న్యూఢిల్లీ: ఈ ఏడాది గాయాలతో సతమతమైన భారత ఓపెనర్ శిఖర్ ధావన్ రంజీమ్యాచ్‌లో అజేయ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. 15 నెలల తర్వాత తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ఈ ‘గబ్బర్’ హైదరాబాద్ బౌలర్లకు తన తడాఖా చూపించాడు. ఉదయం గడ్డకట్టించే శీతల సమయంలో అతనొక్కడే ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. తొలిరోజు ఆటలో అతను (198 బంతుల్లో 137 బ్యాటింగ్; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత ప్రదర్శన కనబరిచాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని హైదరాబాద్ బౌలర్లు సిరాజ్ (2/60), మెహదీ హసన్ (3/61) కుదిపేశారు.
ఒక దశలో 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని కెప్టెన్ ధావన్ ఆదుకున్నాడు. కీలక వికెట్లన్నీ పడటంతో బాధ్యతగా ఆడి తొలిరోజు పూర్తయ్యేవరకు క్రీజులో నిలిచాడు. మిగతావారిలో నితీశ్ రాణా (25; 5 ఫోర్లు), అనూజ్ (29; 3 ఫోర్లు, 1 సిక్స్), కున్వర్ (22 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 84 పరుగులు జోడించిన ధావన్... అబేధ్యమైన ఏడో వికెట్‌కు కున్వర్‌తో 57 పరుగులు జతచేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్‌కు ఒక వికెట్ దక్కింది. తొలి రోజు ఆట ముగిశాక ఢిల్లీ ఆటగాడు కునాల్‌కు, హైదరాబాద్ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డోపింగ్ పరీక్షలు నిర్వహించింది.
అభిషేక్ సెంచరీ: బెంగాల్ 241/4
కోల్‌కతా: ఓపెనర్ అభిషేక్ రామన్ (255 బంతుల్లో 110 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించడంతో... ఆంధ్రతో బుధవారం మొదలైన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట నిలిచే సమయానికి బెంగాల్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి సహా ఆరుగురు బౌలర్లు రోజంతా శ్రమించినా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లను మించి పడగొట్టలేకపోయారు. కౌశిక్ ఘోష్ (37; 5 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అభిõÙక్ తర్వాత మూడో వికెట్‌కు కెపె్టన్ మనోజ్ తివారీ (46; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి 87 పరుగులు జతచేశాడు. దీంతో బెంగాల్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్ 2 వికెట్లు పడగొట్టగా... షోయబ్ ఖాన్, పృథీ్వరాజ్ చెరో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment