సర్వీసెస్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది.
సర్వీసెస్ 218/4
న్యూఢిల్లీ: సర్వీసెస్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. ఓవర్‌నైట్ స్కోరు 53/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సర్వీసెస్ మూడో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో నాలుగు వికెట్లకు 218 పరుగులు చేసింది. మరో 17 పరుగులు చేస్తే సర్వీసెస్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుంది.
రజత్ పలివాల్ (163 బంతుల్లో 8 ఫోర్లతో 72 బ్యాటింగ్), సకూజా (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు యష్‌పాల్ సింగ్ (80 బంతుల్లో 11 ఫోర్లతో 57)తో కలిసి రజత్ నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.