
చండీమల్ సెంచరీ
గాలె: భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాట్స్ మన్ దినేశ్ చండీమల్ సెంచరీ సాధించాడు. 100 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది నాలుగో సెంచరీ.
ఇన్నింగ్స్ ఓటమి తప్పదనుకున్న తరుణంలో చండీమల్ అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గట్టెక్కించాడు. కీలక భాగస్వామ్యాలతో టీమ్ ను ఆధిక్యం దిశగా తీసుకెళ్లాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న 6 వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది.
సంగక్కర 40, మాథ్యాస్ 39, తిమిమన్నె 44 పరుగులు చేసి అవుటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఆరోన్ ఒక వికెట్ తీశాడు.