దివ్యకు స్వర్ణం | Divya gets Gold Medal in Masters Athletics Championship | Sakshi
Sakshi News home page

దివ్యకు స్వర్ణం

Published Tue, Feb 5 2019 10:10 AM | Last Updated on Tue, Feb 5 2019 10:10 AM

 Divya gets Gold Medal in Masters Athletics Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అథ్లెట్‌ బి. దివ్య అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. జైపూర్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన ఆమె స్వర్ణంతో మెరిసింది. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన 35 ప్లస్‌ మహిళల 5 కి.మీ పరుగులో దివ్య విజేతగా నిలిచింది. పరుగును ఆమె అందరికంటే ముందుగా 24 నిమిషాల 35.16 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement