జొకోవిచ్‌ కోచ్‌ ఇవానిసెవిచ్‌కూ కరోనా  | Djokovic Coach Ivanisevic Tested Positive Of Coronavirus | Sakshi

జొకోవిచ్‌ కోచ్‌ ఇవానిసెవిచ్‌కూ కరోనా 

Jun 27 2020 12:09 AM | Updated on Jun 27 2020 12:09 AM

Djokovic Coach Ivanisevic Tested Positive Of Coronavirus - Sakshi

బెల్‌గ్రేడ్‌: ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆడించిన ఆటతో కోవిడ్‌–19 పాజిటివ్‌ బాధితులు పెరిగిపోతున్నారు. అడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ సిరీస్‌ ద్వారా తాజాగా క్రొయేషియా టెన్నిస్‌ గ్రేట్, జొకోవిచ్‌ కోచ్‌ అయిన గొరాన్‌ ఇవానిసెవిచ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. పది రోజుల క్రితం రెండుసార్లు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని... తాజాగా మూడోసారి పాజిటివ్‌ వచ్చిందని గొరాన్‌ తెలిపాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్‌ బారిన పడ్డానని చెప్పాడు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించాడు. అడ్రియా టూర్‌లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్‌ సహా, మరో ముగ్గురు ప్లేయర్లు దిమిత్రోవ్, బోర్నా చోరిచ్, విక్టర్‌ ట్రయెస్కీలకు వైరస్‌ సోకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement