డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట | doubles semis in Saket couple | Sakshi
Sakshi News home page

డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట

Published Sat, Apr 23 2016 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

డబుల్స్ సెమీస్‌లో  సాకేత్ జంట

డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట

నాన్‌జింగ్ (చైనా): టీఏసీ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట 6-1, 6-2తో జోర్డాన్ థాంప్సన్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది.

46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 6-7 (6/8), 6-7 (3/7)తో ఓటమి చవిచూశాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జంట కూడా సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో దివిజ్-రాజా 6-3, 7-5తో ఫెర్నాండెజ్-నికొలస్ జారీ (అమెరికా)లపై నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement