
పాటియాలా: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచింది. ఆమె 11.60 సెకన్లలో గమ్యానికి చేరింది. ద్యుతీకి తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ అథ్లెట్ నిత్య (12.10 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 100 మీటర్లలో శివ కుమార్ (తమిళనాడు–10.43 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ వంశీ ప్రవీణ్ (10.71 సెకన్లు) ఏడో స్థానంతో సంతృప్తి పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment