
National Athletics Grand Prix 2023: బెంగళూరులో జరుగుతున్న జాతీయ అథ్లెటిక్స్ ఇండియన్ గ్రాండ్ ప్రి ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులతో దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకం సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుంజా రజితకు రజతం దక్కింది. జ్యోతిక 54.15 సెకన్లతో అగ్రస్థానంలో, రజిత 55.57 సెకన్లతో రెండో స్థానంలో నిలిచారు.
మరో.. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రొంగలి స్వాతి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. 56.84 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన స్వాతి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్‌లో ట్వింకిల్ పున్దిర్ (మధ్యప్రదేశ్ – 56.75 సెకన్లు) మూడో స్థానం సాధించింది.