
టీమిండియా కోసం షమీ కుటుంబం ఖురాన్ పఠనం
మీరట్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలని భారత పేసర్ మహ్మద్ షమీ ఇంట్లో ఖురాన్ పఠనం చేశారు.
మీరట్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలని భారత పేసర్ మహ్మద్ షమీ ఇంట్లో ఖురాన్ పఠనం చేశారు. పదకొండు మంది మౌల్వీలతో సాహస్పూర్-అలీనగర్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ గ్రామంలో ఉన్న నాలుగు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా మౌల్వీల్లో ఒకరైన మౌలానా మహ్మద్ రిహాన్ రాజా నైమి విలేకరులతో మాట్లాడుతూ 'ప్రత్యేక ప్రార్థనలు కేవలం షమీ కోసం చేయలేదు. మొత్తం టీం ఇండియా విజయం కోసం చేశాం. మేము మాతోపాటు ఊర్లో వారంతా ఒక చోట చేరి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం. ఆ దేవుడి దయతో మన ఆటగాళ్లు ప్రత్యర్థికి సరైన సమాధానం చెప్పాలని' అని అన్నారు. పదకొండు మంది భారత ప్లేయర్ల కోసం పదకొండు మంది మౌల్వీలతో ఖురాన్ పఠనం చేయించినట్లు షమీ తండ్రి తాసిఫ్ తెలిపారు.