మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ శాసించే స్థితిలో నిలిచింది. ఆదివారం కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ (205; 24 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ సాధించగా... సాన్‌ట్నర్ (126; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో పాటు బౌలింగ్‌తోనూ ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరి వీరోచిత ప్రదర్శన న్యూజిలాండ్‌కు గెలుపు అవకాశం సృష్టించింది. ఓవర్‌నైట్ స్కోరు 394/6తో ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 615/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
వాట్లింగ్, సాన్‌ట్నర్ ఏడో వికెట్‌కు 261 పరుగులు జోడించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 262 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌ను ఆఫ్‌స్పిన్నర్ సాన్‌ట్నర్ (3/6)బంతితోనూ దెబ్బ తీశాడు. దీంతో ఆట ముగిసేసమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకోవాలంటే ఆఖరి రోజు ఇంగ్లండ్ ఇంకా 207 పరుగులు చేయాల్సివుంది. చేతిలో మరో 7 వికెట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment