ఫిఫా ర్యాంకింగ్‌సలో భారత ఫుట్‌బాల్ జట్టు గత ఆరేళ్లలో అత్యుత్తమ ర్యాంకును అందుకుంది.
న్యూఢిల్లీ: ఫిఫా ర్యాంకింగ్‌సలో భారత ఫుట్‌బాల్ జట్టు గత ఆరేళ్లలో అత్యుత్తమ ర్యాంకును అందుకుంది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌సలో భారత్ 11 స్థానాలను ఎగబాకి 137వ ర్యాంకును పొందింది. 2010 ఆగస్టులో తొలిసారిగా తమ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు (137)ను సాధించిన అనంతరం మరోసారి ఈ ర్యాంక్‌కు చేరింది.
ఈ ర్యాంక్‌పై కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ సంతోషం వ్యక్తం చేశారు. రెండో పర్యాయం తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు జట్టు ర్యాంకింగ్‌సను మెరుగుపరచాలని భావించానని, ఇప్పుడు అది నెరవేరిందని చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో ఆయన కోచ్‌గా వచ్చినప్పుడు జట్టు ర్యాంకు 171గా ఉంది.