
లక్నో: వరుసగా మూడు విజయాలు సాధించి జోరు మీదున్న అవధ్ వారియర్స్‌కు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో తొలి పరాజయం ఎదురైంది. ముంబై రాకెట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 1–4తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 15–13, 13–15, 15–4తో సన్ వాన్ హో (ముంబై)పై... మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 8–15, 15–10, 15–13తో బీవెన్ జాంగ్ (ముంబై)పై గెలిచారు.
అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో క్రిస్టినా పెడర్సన్–తాంగ్ చున్ మాన్ (అవధ్) జంట... మహిళల డబుల్స్‌లో హెండ్రా సెతియవన్–చిన్ చుంగ్ జోడీ... పురుషుల సింగిల్స్‌లో హర్షిత్ అగర్వాల్ ఓడిపోవడంతో అవధ్ వారియర్స్‌కు ఓటమి ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment