బీసీసీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె మృతి | Former BCCI secretary Jaywant Lele dies | Sakshi
Sakshi News home page

బీసీసీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె మృతి

Published Fri, Sep 20 2013 10:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

Former BCCI secretary Jaywant Lele dies

వడోదర : బీసీసీఐ  మాజీ కార్యదర్శి జయవంత్‌ లెలె గుండె పోటుతో మృతి చెందారు. వడోదరలోని తన నివాసంలో రాత్రి పొద్దు పోయాక లెలె మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. లెలెకు భార్య ఒక కొడుకు, ఒక కుమార్తె వున్నారు. బీసీసీఐ సహాయ కార్యదర్శిగా తొలుత పనిచేసిన లెలె, 1996లో జగ్మోహన్‌ దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో బీసీసీఐ  కార్యదర్శిగా పనిచేశారు.

1996 విల్స్‌ ప్రపంచ కప్‌ను విజయవంతం చేయడంలో లెలె కీలక పాత్ర పోషించారు ఈనెల13న తన 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్న లెలె, ఇండియా ప్లేయర్లుగా సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, వికెట్‌ కీపర్‌ నయన్‌ మోంగియాలను ప్రోత్సహించారు. లెలె మృతి పట్ల క్రికెటర్లు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement