
నాలుగు డకౌట్లు, బౌల్డ్ లు
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ తేలిపోయారు. ఆసీస్ బౌలర్లకు తలవంచారు. తుది సమరంలో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. కంగారూ బౌలర్లు కదం తొక్కడంతో మెక్ కల్లమ్ సేన కకావికలమైంది.
పరుగుల వర్షంతో కల్లోలం సృష్టించే మెక్ కల్లమ్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరడంతో కివీస్ పతనం ఆరంభమైంది. అతడితో పాటు మరో ముగ్గురు డకౌటయ్యారు. ఆస్ట్రేలియా మొత్తం నలుగురిని డకౌట్ చేశారు. ఆండర్సన్, రోంచి, హెన్రీ ఇలా వచ్చి అలా వెళ్లారు.
ఇలియట్, రాస్ టేలర్ కొద్దిసేపు పోరాడినా ఆసీస్ బౌలర్లే పైచేయి సాధించారు. తుది పోరులో కదం తొక్కిన కంగారూ బౌలర్లు నలుగురిని క్లీన్ బౌల్డ్ చేశారు.