
గ్లాస్గోలో మెరిసిన తెలుగుతేజం గ'గన్'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో మరో తెలుగుతేజం మెరిసింది. హైదరాబాదీ స్టార్ షూటర్ గగన నారంగ్ గురి కుదిరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో నారంగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.
సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో గగన్ 203.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి దక్కించుకున్నాడు. ఇదే రోజు అంతకుముందు భారత్ షూటింగ్లోనే మరో రెండు పతకాలు సాధించింది. భారత షూటర్లు జీతూ రాయ్, గురుపాల్ సింగ్ పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ షూటింగ్లో భారత్కు ఇప్పటి వరకు 12 పతకాలు దక్కడం విశేషం. ఇదిలావుండగా, కామన్వెల్త్ గేమ్స్లో తెలుగుతేజం మత్స సంతోషి ఇంతకుముందు పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.