
భారత్‌లోని క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన అది. 2002 జూలై 13.. భారత జట్టు.. ఇంగ్లండ్ గడ్డ మీద లార్డ్స్ మైదానంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికీ యువకులైన యువరాజ్‌సింగ్, మహమ్మద్ కైఫ్ అద్భుతంగా రాణించడంతో నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. చరిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విజయానందంలో ఉప్పొంగిపోయిన అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఎవరూ ఊహించనిరీతిలో చొక్కావిప్పి గాల్లోకి ఎగరేస్తూ.. క్రికెట్ మక్కా లార్డ్స్ బాల్కనీలో జరిపిన సంబరం.. ప్రతి క్రికెట్ ప్రేమికుడి మదిలో మెదులుతూ ఉంటుంది.
ఆనాడు గంగూలీ చేసిన ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అది అసంకల్పితంగా చేసిన చర్య అని గంగూలీ సైతం వివరణ ఇచ్చారు. తాజాగా ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో గంగూలీ భార్య డొనా ఈ ఘటనపై స్పందించారు. గంగూలీ ఆనాడు చేసిన చర్య ఫెంటాస్టిక్ అని కితాబిచ్చారు. గంగూలీ మాట్లాడుతూ.. ‘అలా ఇప్పుడు చేయలేను. ప్రతిసారీ స్పోర్ట్స్ చానెల్‌లో ఆ దృశ్యాన్ని చూపిస్తారు. నేను ఓసారి టీవీ ఎడిటర్‌కు ఫోన్‌చేసి.. నేను 20వేల అంతర్జాతీయ పరుగుల చేశాను. అది చూపించవచ్చు కదా అంటే.. అది చెప్పడానికే ఈ దృశ్యాన్ని వేస్తున్నట్టు చెప్పారు. ఎంతో సంతృప్తితో నేను అలా చేశాను. హానర్ బోర్డు మీద నా పేరు (లార్డ్స్ మైదానంలో గంగూలీ తొలి టెస్టు సెంచరీ సాధించాడు) ఉన్న సంగతి మర్చిపోకూడదు. అది ఎప్పటికీ నాకు స్పెషల్‌గా మిలిగిపోతుంది’ అని చెప్పాడు.

ఇండియా టుడే సదస్సులో గంగూలీ, ఆయన సతీమణి డొనా
Comments
Please login to add a commentAdd a comment