న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, గౌతం గంభీర్ మధ్య విభేదాలున్నాయని ఎంతోకాలంగా ప్రచారంలో ఉంది. అయితే, రిటైర్మెంట్‌కు సిద్ధమైన గంభీర్ వాటికి తెరదించాడు. ధోనీతో తనకు ఎటువంటి స్పర్థలూ లేవని స్పష్టం చేశాడు. అవన్నీ రూమర్లు మాత‍్రమేనని తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని పేర్కొన్నాడు.
2011 వరల్డ్‌కప్ ఫైనల్‌లో హీరోగా నిలిచిన గౌతీ.. 2015 మెగా టోర్నీలో భారత జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు. ‘నాతోపాటు ఆడిన వారు 2-3 వరల్డ్‌కప్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించారు. కానీ నాకు మాత్రం ఆ అవకాశం ఒక్కసారే దక్కినందుకు ఎంతో బాధేసింది. కానీ జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. టైటిల్ సాధించడంలో జట్టు కీలక పాత్ర పోషించడం కంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నా' అని గంభీర్ చెప్పాడు. గురువారం నుంచి జరుగుతున్న ఆంధ్రతో రంజీ మ్యాచ్‌లో గంభీర్‌కు కెరీర్‌లో ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్‌గా నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment