
న్యూఢిల్లీ: ఉమాఖనోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు సవీటి బూరా ఏకైక స్వర్ణాన్ని అందించింది. రష్యాలో మంగళవారం ముగిసిన టోర్నీలో హరియాణాకు చెందిన 25 ఏళ్ల సవీటి... మహిళల 75 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆమె అన్‌ఫినోజెనోవా(రష్యా)పై విజయం సాధించింది.
శశి చోప్రా (57 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు), పవిత్ర (60 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు), వీరేందర్ కుమార్ (91 కేజీలు) రజతాలతో సంతృప్తిపడ్డారు. రబదనోవ్ (రష్యా) చేతిలో బ్రిజేశ్... ఎమ్‌వాల్‌బేల్ (స్వీడన్) చేతిలో వీరేందర్ ఓడిపోయారు. 56 కేజీల విభాగంలో గౌరవ్ బిధురి సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment