బర్మింగ్‌హామ్:1999లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ మ్యాచ్‌లు స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్ మరియు నెదర్లాండ్స్‌లలో కూడా జరిగాయి. అయితే ఆ మెగా టోర్నీలో సరిగ్గా ఇదే రోజు(జూన్ 17) ఆసీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డేగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వివరాల్లోకి వెళితే... దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ -6 మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో లక్ష్యాన్ని చేరుకొని ఆస్ట్రేలియా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికాతోనే సెమీస్ పోరుకు సిద్ధమయ్యింది ఆసీస్. అయితే ఇక్కడ తొలిసారి వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరే అవకాశాన్ని దక్షిణాఫ్రికా తృటిలో చేజార్చుకుంది. గెలిచే అవకాశం ఉన్నప్పటికీన సఫారీలు మ్యాచ్‌ను టై చేసుకునే తుది పోరుకు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌ను ఫ్లెమింగ్ వేయగా, దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. అయితే సఫారీల చేతిలో వికెట్ మాత్రమే ఉంది. దాంతో సఫారీలు ముందుగా కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. కాగా, తొలి మూడు బంతులకు 8 పరుగులు రావడంతో స్కోరు సమం అయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా విజయం అంతా ఖాయమనే అనుకున్నారు.
ఎందుకంటే క్రీజ్‌లో ఉన్నది స్టార్ ఆటగాడు లాన్స్ క్లూసెనర్ కాబట్టి సఫారీ శిబిరంగా ధీమాగా ఉంది. ఇక్కడ దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసి రాలేదు. నాల్గో బంతికి క్లూసెనర్ మరియు అలెన్ డొనాల్డ్ మధ్య గందరగోళం నెలకొంది. పరుగు తీసే క్రమంలో తటపటాయించిన డొనాల్డ్ బ్యాట్ విడిచిపెట్టి పిచ్ మధ్యలో నిలబడిపోయి రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దాంతో మ్యాచ్ టై కావడంతో ఆసీస్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మ్యాచ్ టైగా ముగిసినా ఆసీస్ ఫైనల్‌కు చేరడమే వారి జోష్‌కు ప్రధాన కారణం. సమీకరణాల ప్రకారం సూపర్-6లో సఫారీలపై విజయం సాధించిన ఆసీస్ తుది పోరుకు అర్హత సాధించింది.
ఇక ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఆసీస్ 132 పరుగులకే నిలువరించింది. ఆపై లక్ష్యాన్ని20.1 ఓవర్లలో రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి ఛేదించిన స్టీవ్ వా గ్యాంగ్ కప్‌ను ముద్దాడింది.
Comments
Please login to add a commentAdd a comment