ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లో గుజరాత్ లయన్స్ విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ ఒక గెలుపును మాత్రమే సొంతం చేసుకుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో మరోసారి రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.