కాన్పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ గ్రీన్ పార్క్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా తొలుత రోహిత్ సేనను బ్యాటింగ్ ఆహ్వానించాడు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడంతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లు దాదాపు ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న పరిస్థితుల్లో, ఇంకా రెండు బెర్తులకు నాలుగు జట్ల నుంచి ప్రధాన పోటీ ఏర్పడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ లు తలో ఏడు మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ రేసు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. దీంతో ముంబైకు ఈ మ్యాచ్ లో విజయం కీలకం కాగా, మరోవైపు గుజరాత్ విజయంతో లీగ్ దశను ముగించి ప్లే ఆఫ్ బెర్తుపై నిశ్చితంగా ఉండాలని భావిస్తోంది.
ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్
Published Sat, May 21 2016 8:06 PM | Last Updated on Tue, Aug 21 2018 2:28 PM
Advertisement
Advertisement