హ్యాండ్‌బాల్ స్కూల్ లీగ్
సాక్షి, హైదరాబాద్: విశాల్ స్మారక హైదరాబాద్ హ్యాండ్‌బాల్ స్కూల్ లీగ్ టోర్నమెంట్‌లో ఆలియా గవర్నమెంట్ మోడల్ స్కూల్ (జీహెచ్‌ఎస్), గతి స్కూల్ జట్లు బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. బాలికల ఈవెంట్‌లో నల్లగొండ జెడ్పీహెచ్‌ఎస్, సెయింట్ జోసెఫ్ స్కూల్ జట్లు క్వార్టర్ పోరుకు సిద్ధమయ్యాయి.
ఎల్బీస్టేడియంలో బుధవారం జరిగిన బాలుర విభాగం పోటీల్లో ఆలియా జీహెచ్‌ఎస్ 11-4తో సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి)పై, మరో మ్యాచ్‌లో ఆలియా జట్టు 7-2తో మమత హైస్కూల్ (పోచంపల్లి)పై గెలుపొందింది. గతి జీహెచ్‌ఎస్ (బంజారాహిల్) 5-1తో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌పై, రెండో మ్యాచ్‌లో గతి 10-0తో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, వికారాబాద్)పై నెగ్గింది.
అంతకుముందు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జట్టు 10-2తో ప్రభుత్వ హైస్కూల్ (దేవల్‌జామ్‌సింగ్)పై, ఆర్మీ స్కూల్ 8-3తో జీహెచ్‌ఎస్ (విజయనగర్ కాలనీ)పై, ఎంవీఎం (హైటెక్) 8-3తో జీహెచ్‌ఎస్ (విజయనగర్ కాలనీ)పై, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (షేక్‌పేట్) 11-0తో సెయింట్ పీటర్ హైస్కూల్‌పై, జీహెచ్‌ఎస్ (చాదర్‌ఘాట్) 7-0తో మమత హైస్కూల్ (సికింద్రాబాద్)పై, కేంద్రీయ విద్యాలయం (శివరాంపల్లి) 7-2తో చిరెక్ (ఖాజాగూడ)పై విజయం సాధించాయి.
బాలికల విభాగంలో నల్లగొండ జెడ్పీహెచ్‌ఎస్ 3-2తో జీహెచ్‌ఎస్ (విజయనగర్ కాలనీ)పై, గతి జీహెచ్‌ఎస్ 3-0తో జీహెచ్‌ఎస్ (దేవల్‌జామ్‌సింగ్)పై, మమత హైస్కూల్ 4-1తో గతి జీహెచ్‌ఎస్‌పై, ఎంవీఎం (కొండాపూర్) 4-2తో జీహెచ్‌ఎస్ (విజయనగర్ కాలనీ)పై, ఎంవీఎం (హైటెక్) 3-1తో చిరెక్ (ఖాజాగూడ)పై, లిటిల్ ప్లవర్ హైస్కూల్ 2-1తో జీహెచ్‌ఎస్ (దేవల్ జామ్‌సింగ్)పై, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ 4-3తో మమత హైస్కూల్‌పై, చిరెక్ (కొండాపూర్) 5-1తో జీహెచ్‌ఎస్ (విజయనగర్ కాలనీ)పై, సెయింట్ జోసెఫ్ (కింగ్‌కోఠి) 2-1తో సెయింట్ ఫ్రాన్సిస్ (సికింద్రాబాద్)పై, మమత హైస్కూల్ 2-1తో జీహెచ్‌ఎస్-ఎస్వీబీపీపై గెలుపొందాయి.
క్వార్టర్స్‌లో ఆలియా, గతి స్కూల్స్
Published Thu, Jul 24 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement