సెర్బియా నటితో హార్దిక్‌ పాండ్యా నిశ్చితార్థం | Hardik Pandya Engagement With Actress Serbian | Sakshi
Sakshi News home page

సెర్బియా నటితో హార్దిక్‌ పాండ్యా నిశ్చితార్థం

Published Thu, Jan 2 2020 1:33 AM | Last Updated on Thu, Jan 2 2020 10:27 AM

Hardik Pandya Engagement With Actress Serbian - Sakshi

ముంబై: భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను హార్దిక్‌ వివాహం చేసుకోనున్నాడు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘నా మెరుపుతీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను’ అని హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశాడు. హార్దిక్‌ వెంట బోట్‌లో అతని సోదరుడు కృనాల్‌ పాండ్యా, అతని భార్య పంఖురి కూడా ఉన్నారు.  27 ఏళ్ల నటాషా 2012లో ముంబైకి వచ్చింది. కొన్ని విఖ్యాత బ్రాండ్‌లకు చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. 2013లో ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో సత్యాగ్రహ సినిమాలో నటించింది.

ఆ తర్వాత మరో డజను సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించింది. 2014లో బిగ్‌ బాస్‌–8లో... 2019లో నచ్‌ బలియే డ్యాన్స్‌ షోలో పాలుపంచుకుంది. మరోవైపు 26 ఏళ్ల హార్దిక్‌ గతేడాది దర్శక, నిర్మాత కరణ్‌ జోహర్‌ టీవీ కార్యక్రమంలో పాల్గొని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ద్వారా నిషేధానికి గురయ్యాడు. బేషరతు క్షమాపణలు చెప్పాక హార్దిక్‌పై నిషేధం ఎత్తి వేశారు. గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్‌ ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. న్యూజిలాండ్‌ ‘ఎ’తో త్వరలో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టులో ఎంపికయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement