నిశ్చితార్థం గురించి మాకు తెలీదు: పాండ్యా తండ్రి | We Don't Have Idea On Hardik Pandya Engagement Says Father | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు చెప్పకుండా నిశ్చితార్థం చేసుకున్న పాండ్యా

Published Sat, Jan 4 2020 2:42 PM | Last Updated on Sat, Jan 4 2020 2:43 PM

We Don't Have Idea On Hardik Pandya Engagement Says Father - Sakshi

భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌ వెళ్లిన ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. తన నిశ్చితార్థం గురించి హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశాడు. వీరిద్దరికీ సంబంధించిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యువ జంటకు ధోని, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. (సెర్బియా నటితో హార్దిక్‌ పాండ్యా నిశ్చితార్థం)

ఈ విషయం ఫ్యాన్స్‌తో పాటు పాండ్యా తల్లిదండ్రులను సైతం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా పలు ఆసక్తికరమైన విషాయాలను మీడియాతో పంచుకున్నారు. ‘పాండ్యా, నటాషా నిశ్చితార్థం చేసుకుంటారని మాకు అస్సలు తెలీదు. నిశ్చితార్థం అయిన తరువాత విషయం తెలిసింది. అయితే వారిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం మాత్రం మాకు ముందే తెలుసు. నూతన సంవత్సర వేడుకలకు దుబాయ్‌ వెళ్తున్నారన్న సమాచారం మాకు ఉంది. నటాషా చాలా మంచి అమ్మాయి. వాళ్ల కుటుంబ సభ్యులతో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఆమెను మేం కలిశాం. వారిద్దరి పెళ్లి ఎప్పుడు చేయాలో ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే మంచి ముహూర్తం పెడతాం’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement