ఆమెతో పాండ్యా బ్రేకప్‌.. ఈమెతో షికార్లు..! | Hardik Pandya May BreakUp With Elli AvrRam | Sakshi
Sakshi News home page

ఆమెతో పాండ్యా బ్రేకప్‌.. ఈమెతో షికార్లు..!

Published Sat, Jun 2 2018 4:46 PM | Last Updated on Sat, Jun 2 2018 5:03 PM

Hardik Pandya May BreakUp With  Elli AvrRam - Sakshi

ఎల్లీ అవ్రామ్‌, హర్ధిక్‌ పాండ్యా, ఊర్వశి రౌతెలా (ఫైల్‌)

ముంబై : క్రికెటర్లు, హీరోయిన్ల బంధం తరతరాలుగా కొనసాగుతోంది. గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మలు ఇదే కోవకు చెందుతారు. అయితే ఇటీవల నటి నిధి అగర్వాల్‌- క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌లపై వదంతులు రాగా, తాము కేవలం స్నేహితులమేనని.. ఎప్పటినుంచో తమకు పరిచయం ఉందని వారు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, స్వీడన్ మోడల్-నటి ఎల్లీ అవ్రామ్‌ జోడీ బ్రేకప్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హార్ధిక్ అన్నయ్య, క్రికెటర్ కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ అందరికీ తెలిసింది. అయితే వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ‘హేట్‌ స్టోరీ 4’ నటి ఊర్వశి రౌతెలా. పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్‌ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటినుంచీ వీరి రిలేషన్‌ మొదలుకావడంతో ఎల్లీ అవ్రామ్‌, పాండ్యా నుంచి దూరంగా ఉందంటూ ఊహాగానాలున్నాయి. ఐపీఎల్‌-11 సమయంలో హార్ధిక్‌-ఊర్వశి రౌతెలా ఫొటోలు నెట్‌లో దర్శనమిచ్చాయి.

గతంలో ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి వెళ్లినప్పుడు కెమెరా కంటికి చిక్కగా.. ఫొటోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే బ్రేకప్‌ వదంతులపై హార్ధిక్‌ పాండ్యాగానీ, ఎల్లీ అవ్రామ్‌ స్పందించలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement