
కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ హర్ష భరతకోటి వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. ప్రసాద్ (భారత్)తో శుక్రవారం జరిగిన ఐదో రౌండ్‌లో హర్ష 58 ఎత్తుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో హర్షకిది నాలుగో విజయం.
ఫహాద్ (బంగ్లాదేశ్)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణకే చెందిన ఎరిగైసి అర్జున్ 45 ఎత్తుల్లో నెగ్గాడు. ఐదో రౌండ్ తర్వాత హర్ష, అర్జున్ 4 పాయింట్లతో మరో 13 మందితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment