
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రీజినల్ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్పోర్ట్స్‌మీట్‌లో భాగంగా నిర్వహిచిన చెస్ చాంపియన్‌షిప్‌లో హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్ విద్యార్థి పి. హర్షిత్ కృష్ణ చాంపియన్‌గా నిలిచాడు. మలక్‌పేట్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అండర్–17 బాలుర విభాగంలో హర్షిత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో అగ్రస్థానం కోసం 4.5 పాయింట్లతో హర్షిత్, వెంకట అరుణ్ (గుంటూరు) పోటీపడగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హర్షిత్ విజేతగా నిలిచాడు.
4 పాయింట్లతో హిమసూర్య (నీరజ్ పబ్లిక్ స్కూల్, అమీర్‌పేట) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. వినయ్ (గుంటూరు), యుగ్ జైస్వాల్ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, కింగ్‌కోఠి) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ యు.ఎ. సుందరి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్–17 బాలికలు: 1. పి. వేదలత (ది ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. సీహెచ్. శ్రీకరి (జాన్సన్ గ్రామర్ స్కూల్, హబ్సిగూడ), 3. శ్రీద (సెయింట్ పాయ్స్, అల్వాల్).
అండర్–19 బాలురు: 1. సత్య దినేశన్, 2. శ్రీరామ్ కుమార్, 3. మోనిక్ దత్తా (ది ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి).
బాలికలు: 1. శ్రీ సాయి ప్రణతి (ది ఫ్యూచర్ కిడ్స్, రాజమండ్రి), 2. తాస్య హర్ష శెట్టి (ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్, ఖైరతాబాద్), 3. రితిష (గీతాంజలి, బేగంపేట్).
Comments
Please login to add a commentAdd a comment