
భారత అథ్లెటిక్స్ నయా సంచలనం హిమ దాస్‌కు పూర్తి సహకారం అందిస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కింద నెలకు రూ. 50 వేలు చొప్పున హిమకు లభించనున్నాయి. మరోవైపు హిమ దాస్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రతిభావంతులు ఏపీలో సమృద్ధిగా ఉన్నారని, ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పిస్తే వారు తమ అత్యుత్తమమైన ప్రతిభను కనబర్చి భారతదేశానికి మరింత ఘనకీర్తిని తీసుకువస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment