హిమాలయ్ మెరుపు సెంచరీ | Himalay lightning Century | Sakshi
Sakshi News home page

హిమాలయ్ మెరుపు సెంచరీ

Published Fri, Jun 12 2015 4:46 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

హిమాలయ్ మెరుపు సెంచరీ

హిమాలయ్ మెరుపు సెంచరీ

సాక్షి, హైదరాబాద్ : ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఎన్స్‌కాన్స్, ఇండియా సిమెంట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఎన్స్‌కాన్స్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకోగా, ఇండియా సిమెంట్స్ జట్టుకు 2 పాయింట్లు దక్కాయి. చివరి రోజు ఆటలో ఎన్స్‌కాన్స్ బ్యాట్స్‌మన్ హిమాలయ్ అగర్వాల్ (68 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి ఎన్స్‌కాన్స్ రెండో ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

అంతకుముందు 110/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 93.2 ఓవర్లలో 295 పరుగులు చేసి ఆలౌటైంది. సాయిచరణ్ తేజ్ (58), చంద్రశేఖర్ (51), శాండిల్యా (43) రాణించారు. ఎన్స్‌కాన్స్ బౌలర్ అజారుద్దీన్ 5 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 441/6 (డిక్లేర్డ్) స్కోరు చేసిన ఎన్స్‌కాన్స్‌కు 146 పరుగుల ఆధిక్యం లభించింది. మిగతా లీగ్ మ్యాచ్‌లన్నీ డ్రాగానే ముగిశాయి. అయితే జైహనుమాన్ బ్యాట్స్‌మన్ జి.శశిధర్ రెడ్డి (260 బంతుల్లో 211; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) జెమినీ ఫ్రెండ్స్‌పై విరోచిత పోరాటం చేయగా, ఆర్.దయానంద్ బ్యాట్స్‌మెన్‌పై డెక్కన్ క్రానికల్ బౌలర్ జి.ప్రణీత్ కుమార్ (5/32) నిప్పులు చెరగడం మూడో రోజు ఆటలోని విశేషాలు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
  ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 279, డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 212, ఆర్.దయానంద్ రెండో ఇన్నింగ్స్: 222 (కోరపల్లి శ్రీకాంత్ 51, శ్రీకాంత్ రెడ్డి 50; ప్రణీత్ కుమార్ 5/32), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్: 159/4.

  జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 357, జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 335 (శశిధర్ రెడ్డి 211; యశ్‌పురి 3/39, సతీశ్ 3/76).

  ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 307, ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 343 (బి. అనిరుధ్ 137, అనురాగ్ హరిదాస్ 99), ఈఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 158/4 (టి.రవితేజ 62, ఆకాశ్ 55).

  కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 346, ఎస్‌బీహెచ్: 310 (విశాల్ శర్మ 67, శ్రవణ్ కుమార్ 5/82, ఆరోన్ పాల్ 3/23).
  బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 310, ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 324 (అమోల్ షిండే 94; సూర్యప్రసాద్ 5/53).
  కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 228, ఎస్‌సీ రైల్వే: 174, కేంబ్రిడ్జ్ రెండో ఇన్నింగ్స్: 284/9 (సయ్యద్ అలీ హైదర్ 63, మీర్ జావిద్ అలీ 78), ఎస్‌సీ రైల్వే రెండో ఇన్నింగ్స్: 222/9 (త్రినాథ్ పల్లా 101).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement