అదరగొట్టిన ఆసీస్ ‘ఎ’ | Hit the target Australia 'A' | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఆసీస్ ‘ఎ’

Published Thu, Aug 6 2015 2:03 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

Hit the target Australia 'A'

 9 వికెట్లతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై గెలుపు
 ముక్కోణపు సిరీస్
 
 చెన్నై: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ముక్కోణపు సిరీస్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’పై ఘన విజయం సాధించింది. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన సఫారీ జట్టు 48.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. హెండ్రిక్స్ (64 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎల్గర్ (49 బంతుల్లో 28; 1 సిక్స్), జోండో (31 బంతుల్లో 21; 2 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు.

కోల్టర్‌నీల్ 3, ప్యాటిన్సన్, బోయెసీ, ఎగర్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్ 31 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి నెగ్గింది. ఉస్మాన్ ఖవాజా (82 బంతుల్లో 73; 9 ఫోర్లు), బర్న్స్ (91 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement