లండన్: చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తొలి పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-2 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున దేవేందర్ వాల్మీకి (30వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... బెల్జియం జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (25వ నిమిషంలో), జెరోమ్ ట్రుయెన్స్ (44వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఒలింపిక్ చాంపియన్ జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌ను 3-3తో ‘డ్రా’ చేసుకున్న భారత్... రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌పై 2-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే నాలుగో మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడుతుంది.