మహిళలూ మెరిశారు
• ఆసియా చాంపియన్‌స ట్రోఫీ హాకీ విజేత భారత్
• ఫైనల్లో చైనాపై 2-1తో విజయం
సింగపూర్: ఆసియా హాకీలో భారత్‌కు ఎదురులేదని రుజువరుుంది. భారత పురుషుల జట్టు ఆసియా చాంపియన్‌స ట్రోఫీ టైటిల్ గెలిచిన వారం రోజుల్లోపే భారత మహిళల జట్టు కూడా అదే ట్రోఫీ గెలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో చైనాను 2-1తో ఓడించిన భారత మహిళల జట్టు చరిత్రలో తొలిసారి ఆసియా చాంపియన్‌స ట్రోఫీ విజేతగా అవతరించింది. 2013లో జరిగిన చివరి ఎడిషన్‌లో భారత జట్టు జపాన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలవగా... ప్రారంభ టోర్నీ (2010)లో మూడో స్థానంతో సరిపుచ్చుకుంది. అరుుతే ఈసారి మాత్రం టైటిల్ దక్కించుకోవాలనే కసితో పటిష్ట చైనాపై పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది.
తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఇదే జట్టుతో ఓడినా... ఫైనల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆట 13వ నిమిషంలోనే దీప్ గ్రేస్ ఎక్కా పెనాల్టీ కార్నర్ ద్వారా జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. అరుుతే ద్వితీయార్ధం 44వ నిమిషంలో చైనా ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేసింది. ఆధిక్యం కోసం ఇరు జట్ల నుంచి తీవ్ర స్థారుులో ఎదురుదాడులు జరిగారుు. అరుుతే 60వ నిమిషంలో దీపిక జట్టుకు అవసరమైన కీలక గోల్‌ను అందించి భారత శిబిరంలో ఆనందం నింపింది.
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మహిళల జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. ఒక్కో క్రీడాకారిణికి రెండు లక్షల రూపాయలు, సహాయ సిబ్బంది ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రకటించింది. భారత జట్టుకు ప్రధాని మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్‌తో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.