భారత్ గోల్స్ వర్షం | hockey world league | Sakshi
Sakshi News home page

భారత్ గోల్స్ వర్షం

Published Sun, Mar 8 2015 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

భారత్ గోల్స్ వర్షం

భారత్ గోల్స్ వర్షం

13-0తో ఘనాపై విజయం   
 మహిళల హాకీ వరల్డ్ లీగ్

 
 న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్ లీగ్ రౌండ్-2 టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. ఘనాతో శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత జట్టులో ఎనిమిది మంది క్రీడాకారిణులు గోల్స్ చేయడం విశేషం.
 
  వందన కటారియా (8, 21, 48, 56వ ని.లో) నాలుగు గోల్స్ సాధించగా... జస్‌ప్రీత్ కౌర్ (53, 57వ ని.లో); రాణి రాంపాల్ (23, 33వ ని.లో) రెండేసి గోల్స్ చేశారు. దీప్ ఎక్కా, మోనిక, పూనమ్ రాణి, అమన్‌దీప్ కౌర్, లిలిమా మిన్జ్ ఒక్కో గోల్ అందించారు. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియా 8-0తో కజకిస్థాన్‌పై, రష్యా 7-0తో సింగపూర్‌పై, పోలండ్ 4-1తో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement