నాగ్ పూర్:వరల్డ్ టీ 20లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్ లో హాంకాంగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. జింబ్వాబే జట్టుకు మసకద్జ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తుండగా, హాంకాంగ్ జట్టుకు తన్వీర్ అఫ్జల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
గత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించిన హాంకాంగ్ వరుసగా రెండోసారి టోర్నీలో పాల్గొంటోంది. గత నాలుగు నెలల కాలంలో ఆ జట్టు 10 టి20 మ్యాచ్‌లు ఆడితే 7 ఓడింది. మరోవైపు జింబాబ్వే జట్టులో నిలకడలేమి పెద్ద సమస్య.2009లో మినహా మిగిలిన నాలుగు ప్రపంచకప్‌లలో జింబాబ్వే పాల్గొంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడితే 3 గెలిచి, 6 ఓడింది. ఓవరాల్‌గా టి20ల్లో ఆ జట్టు 48 మ్యాచ్‌లలో 10 గెలిచి, 37 ఓడింది. జింబాబ్వే కూడా తొలిసారి క్వాలిఫయింగ్ పోటీని ఎదుర్కొంటోంది. జింబాబ్వే టాప్-8లో లేకపోవడంతో క్వాలిఫయింగ్ రౌండ్ను ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫీల్డింగ్ ఎంచుకున్న హాంకాంగ్
Published Tue, Mar 8 2016 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement