'ఆ క్రికెట్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ' | India favourites to win WT20, says Kiwi captain Williamson | Sakshi
Sakshi News home page

'ఆ క్రికెట్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ'

Published Tue, Mar 8 2016 5:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

'ఆ క్రికెట్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ'

'ఆ క్రికెట్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ'

ముంబై: వరల్డ్ టీ20 లో టీమిండియానే ఫేవరెట్ జట్టని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు వరల్డ్ కప్ను గెలవాలని ఇక్కడకు వచ్చినా.. ఆ కప్ను అందుకునే ఎక్కువ అర్హత ధోని సేనకే ఉందన్నాడు. వాంఖేడ్ స్టేడియంలో తొలి ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న అనంతరం విలియమ్సన్ మీడియాతో ముచ్చటించాడు.

 

'మేము మార్చి 15 వ తేదీన జరిగే  మొదటి మ్యాచ్లో వరల్డ్ కప్ ఫేవరెట్స్ గా ఉన్న భారత్తో తలపడుతున్నాం.ఆ జట్టు అత్యంత నిలకడగా ఉంది. భారత్ జట్టులో విన్నర్లు ఎక్కువ.  ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం కష్టమే. ఈ టోర్నీకి ఎలా సన్నద్ధమవుతున్నామో, అదే క్రమంలో ఇక్కడ ఉండే పరిస్థితికి కూడా పూర్తిగా అలవాటు పడాలి. గత కొంతకాలంగా యువకులతో కూడిన మా జట్టు అనేక విజయాల్ని సొంతం చేసుకుంది.  ఇదే ఊపును వరల్డ్ టీ 20లో కూడా కొనసాగించాలని అనుకుంటున్నాం'అని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రెండెన్ మెకల్లమ్పై విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. తమకు అతనొక ఆదర్శ కెప్టెన్ అని అభివర్ణించాడు. న్యూజిలాండ్ విజయాల్లో మెకల్లమ్ పాత్ర మరువలేనిదని విలియమ్సన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement