సాక్షి, హైదరాబాద్: అఖిల భారత రంజీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో తలపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన హెచ్‌సీఏ... ఎస్. బద్రీనాథ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఎ. లలిత్ మోహన్, పి. సాకేత్ సాయిరాం, రోహన్ యాదవ్, ప్రిన్స్, టి. రవితేజ, బి. యతిన్ రెడ్డిలను స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. ఈ జట్టుకు భరత్ అరుణ్ కోచ్‌గా ఎంపికవగా... జాకీర్ హుస్సేన్ అసిస్టెంట్ కోచ్‌గా, సి. దయానంద్ ఫీల్డింగ్ కోచ్‌గా, ప్రశాంత్ ఫిజియోగా వ్యవహరిస్తారు. కోల్‌కతాలో ఈనెల 25 నుంచి మార్చి 6 వరకు ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది.
జట్టు వివరాలు: ఎస్. బద్రీనాథ్ (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. అనిరుధ్, బి. సందీప్, కె. సుమంత్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ఆకాశ్ భండారి, ఎం. రవికిరణ్, సీవీ మిలింద్, మొహమ్మద్ సిరాజ్, హిమాలయ్ అగర్వాల్, ముదస్సిర్ హుస్సేన్, కె. రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, శరద్ ముదిరాజ్.
విజయ్ హజారే టోర్నీకి హైదరాబాద్ జట్టు
Published Tue, Feb 21 2017 10:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement