
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు రాణించాయి. కొండాపూర్‌లో జరిగిన ఈ టోర్నీ బాలబాలికల విభాగాల్లో మూడో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో నిజామాబాద్, వరంగల్... బాలికల కేటగిరీలో వరంగల్, నిజామాబాద్ వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజామాబాద్ 15–9, 15–11తో వరంగల్‌పై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హైదరాబాద్ 15–9, 15–11తో కరీంనగర్‌ను ఓడించింది. బాలికల తుదిపోరులో వరంగల్ 15–8, 15–12తో నిజామాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్ 15–6, 15–8తో రంగారెడ్డిని ఓడించి మూడోస్థానాన్ని సాధించింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో గచ్చిబౌలి ఏసీపీ ఎన్. శ్యామ్ ప్రసాద్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment