![Hyderabad Tennis Player Sai Dedipya Enters Into Quarters In AITA Tourney - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/25/tennis-hyderabad.jpg.webp?itok=_8J4yfcg)
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య నిలకడగా రాణిస్తోంది. హరియాణాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకుంది. మంగళవారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి దేదీప్య (తెలంగాణ) 6–2, 6–4తో సింధు జనగామ (తెలంగాణ)పై వరుస సెట్లలో గెలుపొందింది. అంతకుముందు తొలి రౌండ్‌లో 6–3, 6–0తో షాను అగర్వాల్ (ఢిల్లీ)ని ఓడించింది. నేడు జరిగే క్వార్టర్స్ మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన షెఫాలీ అరోరాతో దేదీప్య ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment