బ్రిస్టల్: భారత క్రికెటర్ రోహిత్ శర్మను సహచర ఆటగాళ్లు, అభిమానులు 'హిట్ మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఈ పేరంటే తనకు ఎంతో ఇష్టమని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ప్రస్తుతం కోహ్లి నాయకత్వంలోని టీమిండియా.. ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ మేరకు జరిగిన టీ 20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో రాణించి జట్టును గెలిపించాడు.
‘నన్ను చాలా మంది ‘హిట్‌మ్యాన్' అని ముద్దుగా పిలుచుకుంటారు. నిజానికి ఈ పేరంటే నాకు చాలా ఇష్టం. టీ20ల్లో ఇప్పటి వరకు నేను మూడు సెంచరీలు సాధించాను. ఈ మూడు నాకెంతో ప్రత్యేకం. ఏ ఒక్కటి మరో దాని కంటే గొప్పదని చెప్పలేను. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు సాధించాలి’ అని రోహిత్ పేర్కొన్నాడు.
మరొకవైపు భార్య రితిక గురించి మాట్లాడుతూ.. ‘చాలా మంది రితిక గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న సమయంలోనే సెంచరీ సాధిస్తానని అనుకుంటారు. కానీ, ఇప్పుడు ఇక్కడ రితిక లేదు. ఆమె టీవీలో మ్యాచ్ చూసి ఉండొచ్చు. కొద్ది రోజుల్లో ఆమె ఇక్కడికి వస్తుంది’ అని రోహిత్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment