ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ | iam not going to retire now, says ms dhoni | Sakshi
Sakshi News home page

ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ

Published Thu, Mar 26 2015 8:32 PM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ

ఇప్పుడే రిటైర్ కావట్లేదు: ధోనీ

ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ చెప్పాడు.

సిడ్నీ: ఇప్పట్లో తనకు రిటైరయ్యే ఆలోచన ఏదీ లేదని టీమిండియా కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడే సందర్భంలో... 'ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి ప్రపంచ కప్పా' అన్న ప్రశ్నకు ధోనీ ఏమాత్రం తడబడలేదు. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్లో ఆడతానని, ఆ తర్వాత తన ఫిట్నెస్ను బట్టి 2019 ప్రపంచ కప్లో ఆడాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని అంతే కూల్గా సమాధానం ఇచ్చాడు.

ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించాడు. ఛేజింగ్లో భారత ఓపెనర్లు శుభారంభం అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపిందని ధోనీ చెప్పాడు. తాను కూడా పూర్తి స్థాయిలో రాణించలేకపోయానని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement